Date : 26 October 2026
Posted By : RVI

సంగారెడ్డి గురునానక్ మందిర్‌కు కొత్త శోభ.. రెండు కమాన్ల నిర్మాణానికి శ్రీకారం

సంగారెడ్డి గురునానక్ మందిర్‌కు కొత్త శోభ.. రెండు కమాన్ల నిర్మాణానికి శ్రీకారం

సంగారెడ్డి అర్బన్: పట్టణంలోని బ్రాహ్మణవాడలో గురునానక్ మందిర్‌కు వెళ్లే మార్గంలో రెండు కమాన్ల నిర్మాణ పనులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. గత గురునానక్ జయంతి సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ పనులకు శ్రీకారం చుట్టారు. గురునానక్ మందిర్ ప్రవేశ మార్గంలో ఒకటి, మందిర్ సమీపంలోని భవాని మందిర్ రోడ్డులో మరొక కమాన్ నిర్మించనున్నారు. అంతకుముందు గురునానక్ మందిర్‌ను సందర్శించిన జగ్గారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర్ ప్రతినిధులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.మందిర్ ప్రాంగణంలోని రావిచెట్టు కింద ఉన్న నాగదేవత ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్‌కు జగ్గారెడ్డి సూచించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాలను యథాస్థానంలోనే ఉంచి అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సిక్కు ప్రముఖులు డాక్టర్ సర్దార్ సురేందర్ గోపి సింగ్, సర్దార్ తేజేందర్ సింగ్, సర్దార్ స్వరణ్ సింగ్, సర్దార్ సత్‌పాల్ సింగ్, డాక్టర్ సర్దార్ భరత్ సింగ్, సిక్కు గురువు గురుదేవ్ సింగ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి, సుదీప్, నరేన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.