Date : 26 October 2026
Posted By : RVI

‘నన్ను క్షమించు.. పాపను జాగ్రత్తగా చూసుకో’: బెట్టింగ్ మహమ్మారికి మరో బలి

‘నన్ను క్షమించు.. పాపను జాగ్రత్తగా చూసుకో’: బెట్టింగ్ మహమ్మారికి మరో బలి

యాదాద్రి కలెక్టరేట్: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన గంధమల్ల భరత్(35) పట్టణంలోని బంజారాహిల్స్ కాలనీలోని అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బెట్టింగ్ యాప్‌లకు బానిసై.. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన భార్యకు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా బెట్టింగ్ వ్యసనం నుండి బయటపడలేకపోతున్నానని క్షమించాలని భార్యను కోరుతూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నీకు, పాపకు ముఖం చూపించలేకపోతున్నాను. పాప జాగ్రత్త’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ ఆధారంగా మృతునికి భార్య ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది.