Date : 28 October 2026
Posted By : RVI

క్రేజీ అప్‌డేట్.. కెరీర్లో ఫస్ట్ టైమ్.. ఫుల్ గ్లామర్ పాత్రలో రితికా..

 క్రేజీ అప్‌డేట్.. కెరీర్లో ఫస్ట్ టైమ్.. ఫుల్ గ్లామర్ పాత్రలో రితికా..

టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పవర్‌పేట’ చిత్రం నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న టాలెంటెడ్ బ్యూటీ రితికా నాయక్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో ఆమె పోషించిన ‘పడమటవీధి జానకి’ పాత్రను పరిచయం చేస్తూ క్రియేట్ చేసిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

గత చిత్రాలలో హోమ్లీ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో మెప్పించిన రితికా నాయక్, తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఈ సినిమాతో ఫుల్ గ్లామర్ డోస్ పెంచినట్లు ఈ గ్లింప్స్ చూస్తే స్పష్టమవుతోంది. సాంప్రదాయకమైన గ్రేస్‌తో పాటు మోడ్రన్ చార్మింగ్ లుక్స్‌తో, కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో జానకిగా రితికా స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. మునుపెన్నడూ చూడని సరికొత్త బోల్డ్ అండ్ గ్లామరస్ యాంగిల్‌లో ఆమె కనిపిస్తుండటంతో, ఈ బర్త్‌డే గ్లింప్స్ ఆమె అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాను 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. సంగీతాన్ని అందిస్తుండగా, మ్యాధీ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ‘పడమటవీధి జానకి’గా రితికా నాయక్ గ్లామర్ అండ్ పవర్‌ఫుల్ ఎంట్రీతో ‘పవర్‌పేట’ చిత్రంపై అంచనాలు ట్రేడ్ వర్గాల్లో మరింతగా పెరిగిపోయాయి.