Date : 29 October 2026
Posted By : RVI

అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నా: కొండా సురేఖ

అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నా: కొండా సురేఖ బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో నిరాధారమైన వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తన మాటల వల్ల కేటీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. కొండా సరేఖ తాజాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మాజీ మంత్రి కొండా సురేఖ ఉపసంహరించుకున్నారు. ఆ వ్యాఖ్యలు నిరాధారమైనవని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని పేర్కొంటూ సోషల్‌ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. తన మాటల వల్ల కేటీఆర్‌ లేదా ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. వారిని ఉద్దేశపూర్వకంగా బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

'బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్‌ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే దురుద్దేశం గానీ నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను' అని కొండా సురేఖ ట్వీట్ చేశారు.