Date : 31 October 2026
Posted By : RVI

చాకరిమెట్ల ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

చాకరిమెట్ల ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్ల గ్రామంలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గాదే ప్రవీణ్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీతా రామచంద్ర స్వామి ఆలయంలోనూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, జిల్లా న్యాయమూర్తి సుచరిత, ఆర్డీవో రామకృష్ణ, డీఎస్పీ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.