Date : 13 November 2026
Posted By : RVI

హైదరాబాద్‌లో రూ.232.7 కోట్లతో ‘సైన్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’.. అంతరిక్ష అద్భుతాల నుంచి రోబోటిక్స్ వరకు!

హైదరాబాద్‌లో రూ.232.7 కోట్లతో ‘సైన్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’.. అంతరిక్ష అద్భుతాల నుంచి రోబోటిక్స్ వరకు!

మరో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా, పరిశోధన రంగాల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాగ్యనగరంలో త్వరలో ప్రపంచస్థాయి సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.232.7 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. తార్నాకలోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్రాంగణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది మే, జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నమూనా చిత్రాలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి గురువారం తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, భారతీయ సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో అనుసంధానించడం ఈ సెంటర్ ప్రధాన ఉద్దేశమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో సందర్శకులను ఆకట్టుకునే ఎన్నో ప్రత్యేక విభాగాలు ఉండనున్నాయి. ముఖ్యంగా 3డీ డిజిటల్ డోమ్ థియేటర్, రోబోటిక్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్, వాక్‌త్రూ ఆక్వేరియం, మోషన్ సిమ్యులేటర్ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి