Date : 13 November 2026
Posted By : RVI

అడవి సొర.. దాహం తీర్చే ప్రకృతి సుర

అడవి సొర.. దాహం తీర్చే ప్రకృతి సుర

ప్రకృతే వారి జీవనాధారం. ప్రకృతి ప్రసాదించే వనరులే వారికి తోడు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల పంచాయతీ గంగమ్మకాలనీలో ఆదివాసీ గృహాల్లో కనిపిస్తున్న తెల్ల సొర తీగ విశిష్టమైనది. దీని కాయలను సేకరించి గుజ్జు తొలగించి ఎండబెడతారు. లోపల నీటిని నింపుకొని పొలాలకు వెళ్లేటప్పుడు, అడవిలో సంచరించేటప్పుడు, దూర ప్రయాణాల్లో వెంట తీసుకెళ్తారు. దాహం వేసినప్పుడల్లా అందులోని నీటిని తాగుతారు. ఆధునిక నీటి సీసాలు అందుబాటులో ఉన్నా.. నీటి చల్లదనం కోసం ప్రకృతి సంప్రదాయాన్ని ఆదివాసీలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రకృతితో మమేకమైన వారి జీవనశైలికి ఈ తెల్ల సొర ఓ నిదర్శనం.