Date : 19 November 2026
Posted By : RVI

నా కూతురిపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా సీరియస్ వార్నింగ్

నా కూతురిపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా సీరియస్ వార్నింగ్

నటి ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ఆమె తండ్రి, సీనియర్ నటుడు అర్జున్ సర్జా తీవ్రంగా స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన కూతురి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కించపరిచేలా వార్తలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోనంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు కంప్లెయింట్ చేసినట్లు అర్జున్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ పంచుకున్నారు.

''నా కుమార్తె అంజనా వివాహం సందర్భంగా ఆమెకు, మా కుటుంబానికి ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలు మాకు ఎంతో విలువైనవి. అయితే నా చిన్న కుమార్తె వివాహం జరిగిన సమయంలో, నా పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె వ్యక్తిగత విషయాలను గౌరవిస్తూ, వాటిపై మాట్లాడకూడదని నేను నిర్ణయించుకున్నాను. ప్రతి మహిళకు తన సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపే స్వేచ్ఛ ఉంది. ఆమె తన గురించి, తనకు అనిపించినప్పుడు, స్వయంగా మాట్లాడుతుంది. అయితే, ఒక తండ్రిగా నా కుమార్తెపై, ఆమె వ్యక్తిత్వంపై, వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు, తీవ్రంగా కించపరిచే ఆరోపణలు వస్తుంటే మాత్రం మౌనంగా ఉండలేను''