పెద్ద శంకరంపేట: నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పొట్టోళ్ల సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేటలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 14 తర్వాత చనిపోయిన రైతు కుటుంబాలకు న్యాయం చేకూర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మండల ప్రత్యేక అధికారి జగదీష్, మండల శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.