Date : 24 November 2026
Posted By : RVI

రిచ్ విజన్ కార్యాలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవ వేడుకలు

రిచ్ విజన్ కార్యాలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవ వేడుకలు

ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజర్ రాజు, క్యాషియర్ సంధ్య, ప్రోడక్ట్ ఇన్‌చార్జ్ మమత, గ్రాఫిక్స్ ఎడిటర్ నితిన్, లావణ్య, రేణుక పాల్గొన్నారు. కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి పూజా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సంస్థ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.సిబ్బంది ఇదే ఐకమత్యంతో, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగాలని యాజమాన్యం ఆకాంక్షించింది. ఉద్యోగుల భవిష్యత్తుకు సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారు సంస్థలోనే స్థిరంగా కొనసాగుతూ మరింత అభివృద్ధి సాధించేలా యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చింది.కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, సంప్రదాయాలను గౌరవిస్తూ సంస్థలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పిన సిబ్బంది అందరికీ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.