ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి జిల్లా పీపీ రవీందర్‌

RVIRVI
18 Nov, 26
 0  17
ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి జిల్లా పీపీ రవీందర్‌

పెద్దపల్లి: ఓ కేసులో నిందితుడిని శిక్ష నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన పెద్దపల్లి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) రవీందర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ధర్మారం మండలం రచ్చపల్లికి చెందిన భూ వివాదం, హత్య కేసులకు సంబంధించి ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడికి అనుకూలంగా వాదించేందుకు పీపీ పి.వి. రవీందర్ రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు రూ. 1.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రణాళిక ప్రకారం బుధవారం ఉదయం బాధితుడు నేరుగా పీపీ నివాసానికి వెళ్లి రూ.1.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో పీపీ రవీందర్‌తో పాటు ఆయన అనుచరుడు రెడ్డి రాజుల రాజన్నను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.