ఏసీబీ వలలో ఎల్లంపేట్ మున్సిపాలిటీ అధికారి రవీందర్ రెడ్డి
మేడ్చల్ పట్టణం: ఎల్లంపేట మున్సిపాలిటీలో రావల్ కోల్ వార్డు అధికారిగా పని చేస్తున్న డి.రవీందర్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రావల్ కోల్ గ్రామంలో ఓ ఇంటి మ్యుటేషన్‌కు సంబంధించి రూ.40 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.30 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేసి రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని, అతని నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు.