అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట

RVIRVI
31 Oct, 26
 0  35
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట

శంకరపట్నం: గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో శనివారం పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. గ్రామంలో ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 72 వాహనాలను సీజ్ చేశారు. ఏసీపీ మాధవి మాట్లాడుతూ.. నిర్బంధ తనిఖీల ద్వారా గ్రామాల్లో అక్రమ కార్యకలాపాలు, అనుమానిత వ్యక్తులను గుర్తించే వీలుందన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ గ్రామీణ సీఐ శ్రీనివాస్, జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ, పలువురు సీఐలు, ఎఎస్సైలు పాల్గొన్నారు