యాదాద్రిలో వైభవంగా కోటి పుష్పార్చన కార్యక్రమం

RVIRVI
19 Nov, 26
 0  14
యాదాద్రిలో వైభవంగా కోటి పుష్పార్చన కార్యక్రమం

ఆలేరు (ఈటీవీ): కార్తిక మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో కోటి పుష్పార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. శ్రీ స్వామివారికి కోటి నామాలు, కోటి పుష్పాలతో అర్చన నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమాన్ని దేవస్థానం ఆలయ ఈవో భవానీ శంకర్, వేద పండితులు, దేవస్థాన అర్చక స్వాముల సమక్షంలో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. నేటి నుంచి నిరంతరాయంగా శాస్త్రోక్త విధానంలో నామావళి పారాయణం చేస్తూ పుష్పార్చన కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగి సంపూర్ణం కానుంది. ఈ కోటి పుష్పార్చన కార్యక్రమం యాదగిరిగుట్ట క్షేత్రంలో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.