27 నుంచి రాష్ట్రంలో వర్షాలు - ఈసారైనా నీటి బొట్టును ఒడిసిపడదామా?

RVIRVI
26 Oct, 26
 0  48
27 నుంచి రాష్ట్రంలో వర్షాలు - ఈసారైనా నీటి బొట్టును ఒడిసిపడదామా?

మనిషి మనుగడకు నీరు జీవనధారం. కానీ నీటి శాతం ఏటికేడు తగ్గిపోతూ వస్తోంది. జనాభా విపరీతంగా పెరిగిపోవటం, అలాగే ఇతర కారణాల వల్ల భూగర్భ జలాలను విచ్చలవిడిగా వెలికి తీస్తున్నారు. కానీ వినియోగానికి తగ్గట్లు నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం లేదు. నీటిని సరిగ్గా పొదుపు చేసుకోకుండా విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో అంతటా నీటి లభ్యత తగ్గిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితులకు ఎల్​నినో కూడా తోడైంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షపు నీటిని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పటి నుంచే సన్నాహాలు

రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు పలుచోట్ల ప్రజలు సిద్ధమయ్యారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. నల్గొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం వావిళ్లపల్లిలో వర్షం నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసేందుకు ఆ ఊరి ప్రజలు ఓ ట్యాంకును నిర్మించారు. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో వీబీజీ రామ్​జీ పథకం కింద నీటిని ఒడిసిపెట్టేందుకు గుంతలు తవ్వుతున్నారు.

సంరక్షణకు ఇవి పాటించడం ఉత్తమం

  • వర్షం కురిసే సమయంలో ఇళ్లపై నుంచి వర్షపు నీరు పడుతుంది. దానిని భూమిలోకి ఇంకేలా గుంతలు ఏర్పాటు చేయాలి. అలాగే ఇంట్లో వాడిన నీటిని కూడా ఆ గుంతలోకి వెళ్లేలా చూడాలి.
  • పంట పొలాల్లో కందకాలు వంటివి తవ్వి వృథా నీటిను అందులోకి పంపించాలి. వ్యవసాయంలో బిందు సేద్యాన్ని పాటించాలి.
  • ఆర్వో వాటర్​ ప్లాంట్​ నుంచి వృథా నీరు వస్తుంది. ఆ నీటిని ఇంకుడు గుంతలు, చెట్లకు మళ్లించాలి. స్నానాలకు షవర్లు వాడకుండా బకెట్‌ నీటిని ఉపయోగించాలి. ఇళ్లలో నీటి లీకేజీలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పదేళ్లుగా వర్షపు నీటిపైనే ఆధారం