యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో తెలంగాణ గవర్నర్‌

RVIRVI
31 Oct, 26
 0  36
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో తెలంగాణ గవర్నర్‌

ఆలేరు: శ్రీ జనార్ధనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28 నుంచి యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్వహిస్తున్న తెలంగాణ వేద విద్వన్మహాసభలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండపైన అతిథి గృహం వద్దకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు వేదమంత్రాలతో వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ శ్రీ స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను గవర్నర్ గారికి అందజేశారు. అనంతరం దేవస్థానం రూపొందించిన 2027 నూతన వార్షిక క్యాలెండర్‌ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఆవిష్కరించారు. కార్యక్రమంలోమ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్  ఐఏఎస్, జిల్లా కలెక్టర్  అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.