ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
- వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న గూడ్స్ వెహికిల్..
- క్యాబిన్‌లోనే డ్రైవర్ మృతి..
సంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రింగ్ రోడ్డు ఎగ్జిట్ నం.2 వద్ద డివైడర్‌పై ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద తీవ్రతకు అశోక్ లేలాండ్ వాహనం డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్లకు నీళ్లు పోస్తున్న మరో వ్యక్తి కూడా వాహనం కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం పరీక్షల నిమిత్తం పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.