జియో ఐపీఓతో ఆ కుటుంబం దశ తిరిగింది.. లిస్టింగ్‌తోనే నేరుగా రూ. 6500 కోట్ల సంపద వచ్చింది!

RVIRVI
28 Oct, 26
 0  52
జియో ఐపీఓతో ఆ కుటుంబం దశ తిరిగింది.. లిస్టింగ్‌తోనే నేరుగా రూ. 6500 కోట్ల సంపద వచ్చింది!

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓలో లాట్స్ వచ్చినవారికి ఇవాళ లిస్టింగ్‌తో మంచి రిటర్న్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఒక్కో లాట్‌పై సుమారు రూ.3 వేల వరకు ప్రాఫిట్ వచ్చింది. అయితే ఈ సంగతి కాస్త పక్కనబెడితే మహేంద్ర నహాతా కుటుంబం ఈ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టిన పెట్టుబడులపై ఏకంగా 136 రెట్ల మేర లాభం రావడం విశేషం. అప్పట్లో ఒక్కో షేరును రూ. 10 చొప్పున కొనుగోలు చేయగా రికార్డు స్థాయిలో ఇప్పుడు వేల కోట్ల లాభం వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్ని చూద్దాం.
Nahata Family Investment Jio : చాలా మంది స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కొందరు దూరదృష్టితో చూసి ముందే పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తంలో రాబడి అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకమునుపే అందులో వాటా కొనుగోలు చేసిన వారికి లిస్టింగ్ సమయంలో ఊహించని స్థాయిలో రిటర్న్స్ కనిపిస్తుంటాయి. ఇవాళ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ లిస్టింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇది సాధారణ ఇన్వెస్టర్లకు కూడా మంచి రిటర్న్స్ అందించింది. ఇష్యూ ధర రూ. 1119 గా ఉండగా దీనిపై 21 శాతానికిపైగా ప్రీమియంతో రూ. 1358 వద్ద లిస్టయింది. దీంతో ఒక్క లాట్‌పైనే రూ. 3 వేల వరకు ప్రాఫిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే అదే జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ లిస్టింగ్‌తో కళ్లుచెదిరే రీతిలో రిటర్న్స్ అందుకున్నవారు కూడా ఉన్నారు.

అందులో ఒకటి కోల్‌కతాకు చెందిన మహేంద్ర నహాతా ఫ్యామిలీ. అవును గతంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఈ కుటుంబం చేసిన రూ. 48 కోట్ల పెట్టుబడి విలువ ఇవాళ జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్‌తో రికార్డు స్థాయిలో రూ. 6501 కోట్లకు చేరుకుంది. 2020లో ఈ షేర్లు రాగా, ఆరేళ్ల వ్యవధిలోనే ఏకంగా 136 రెట్ల లాభం అందుకున్నారు.