భర్త ఇంటి ముందు భార్య ధర్నా

RVIRVI
31 Oct, 26
 0  49
భర్త ఇంటి ముందు భార్య ధర్నా

ఖిలావరంగల్, న్యూస్‌టుడే: లండన్‌లో ఉద్యోగం పేరుతో వివాహం చేసుకొని వదిలేసి వెళ్లిన భర్త ఇంటి ముందు బైఠాయించి భార్య ధర్నా చేసిన సంఘటన శివనగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. నర్సంపేటకు చెందిన దివ్యకు 2022లో శివనగర్‌కు చెందిన మచ్చ పవన్‌కుమార్‌తో వివాహమైంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించి కట్నకానుకలు ఘనంగా తీసుకున్నారు. అనంతరం నాలుగు నెలలకే లండన్‌లో ఉద్యోగం వచ్చిందని పవన్‌ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆడబిడ్డ, ఆమె కుమారులు తనను వేధిస్తున్నారని దివ్య ఆరోపించారు. ఈ వ్యవహారంలో గతంలో నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. అధికారులు, పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు. ఆమె తల్లి, మహిళా సంఘాల సభ్యులు దివ్యతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. మిల్స్‌కాలనీ పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు.