ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం వద్దు.. సత్వర పరిష్కారానికి కృషి చేయాలి : సంగారెడ్డి కలెక్టర్

RVIRVI
26 Oct, 26
 0  34
ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం వద్దు.. సత్వర పరిష్కారానికి కృషి చేయాలి : సంగారెడ్డి కలెక్టర్

సంగారెడ్డి అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని సూచించారు.సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సంగీత తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించాలని సూచించారు. అనవసర జాప్యం లేకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 49 ఫిర్యాదులు అందాయి. వీటిలో సంగారెడ్డి డివిజన్ నుంచి 9, నారాయణఖేడ్ నుంచి 2, జహీరాబాద్ నుంచి 3, కలెక్టరేట్‌లో 35 ఫిర్యాదులు అందాయి. అందోల్ డివిజన్ నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.