కానిస్టేబుల్ చేతివాటం - సీజ్ చేసిన బంగారు ఆభరణాలు తాకట్టు, ఫోన్ నుంచి మనీ ట్రాన్స్ఫర్
హైదరాబాద్ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌శాఖలోనే ఓ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తునే కాజేశాడు. హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌పై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఓ కేసులో సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి ఆన్లైన్ ద్వారా ఏకంగా రూ.లక్షా 70 వేలను తన బంధువుల ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అదే కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రజల సొత్తుకు కాపలాగా ఉండాల్సిన పోలీసే సీజ్ చేసిన సొత్తును కాజేయడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశంగా మారింది.