తెలంగాణకు మెస్సీ వచ్చాడు.. రొనాల్డోను కూడా తీసుకొస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

RVIRVI
20 Nov, 26
 0  10
తెలంగాణకు మెస్సీ వచ్చాడు.. రొనాల్డోను కూడా తీసుకొస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీని తెలంగాణకు తీసుకొచ్చామని.. పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను కూడా రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు జనాభాతో పాటు రాష్ట్రాల జీడీపీ, ఆర్థిక ప్రగతిని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌, ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ, విద్యా సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులపై ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు.