రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి: ఎమ్మెల్యే

RVIRVI
18 Nov, 26
 0  16
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి: ఎమ్మెల్యే

నస్రుల్లాబాద్: రైతులు వేసవిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో బుధవారం చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్ నినో దృష్ట్యా బోర్లలో నీటి నిల్వలు, విద్యుత్ సరఫరాను దృష్టిలోపెట్టుకుని ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వేసవిలో సాగు చేసిన పంటలను ఎట్టి పరిస్థితుల్లో ఎండనివ్వబోమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.   ఆర్డీఓ రవీందర్ రెడ్డి, సర్పంచి లక్ష్మి, ఏఎంసీ ఛైర్‌పర్సన్ శ్యామల, ఎంపీడీవో ఈశ్వర్ గౌడ్, తహసీల్దార్ సువర్ణ, మాజీ ఎంపీపీ విట్టల్ పాల్గొన్నారు.