సమస్య పరిష్కారానికి కృషి చేస్తా : రితేష్ రాథోడ్

RVIRVI
28 Oct, 26
 0  45
సమస్య పరిష్కారానికి కృషి చేస్తా : రితేష్ రాథోడ్

ఉట్నూర్ : ఉట్నూర్ మండల కేంద్రంలోని డంపింగ్ యార్డ్ ను వేరే ప్రాంతాలకు తరలించేందుకు తన వంతుగా కృషి చేస్తానని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. బుధవారం ఆయన హనుమాన్ నగర్, మేదరివాడ, ఎన్టీఆర్ నగర్ కాలనీలకు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ కు సమీపంలో కాలనీలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల, మహిళా వసతి గృహం, రైతు వేదిక ఉన్నాయని, డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్య పై స్థానిక ఎమ్మెల్యే, సర్పంచ్‌ లను పలుమార్లు కోరినప్పటికీ స్పందన లేదని ఆయనకు వివరిస్తూ వాపోయారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్‌లో ఉన్న చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటామని, స్థానిక ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని రితేష్ రాథోడ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఉట్నూర్ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, పట్టణ అధ్యక్షులు తన్నీరు సతీష్, జిల్లా కార్యదర్శి కొండెరి రమేష్, నాయకులు కాలనీ వాసులు శ్రీకాంత్ , కాలేరి గంగాధర్, రామగిరి వేణు, చింతల రమణ , బాణావత్ శ్రీనివాస్, కనక విజయ్, బొంతల భీమన్న, పున్నం సాయి ఉన్నారు.