"ఇల్లు కోసం అల్లు అర్జున్‌ లా నియవ్వ తగ్గేదే లే అంటే కుదరదు బాస్!".

RVIRVI
11 Nov, 26
 0  35

ప్రస్తుత రోజుల్లో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సొంత ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు చేసేందుకు లక్షల రూపాయల నుంచి కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఇందుకోసం తప్పనిసరిగా బ్యాంకుల్లో గృహ రుణం (home Loan) తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే, చాలా మంది జీవితంలో ఒక్కసారే ఇల్లు కట్టుకుంటాం కదా అని ఖర్చుకు వెనకాడకుండా ఇష్టారీతిలో లగ్జరీ సొబగులతో ఇంటి నిర్మాణం చేపడతారు. తమ బంధువులు, స్నేహితులు చెప్పే సలహాలను పాటిస్తూ తమ ఇంటి నిర్మాణంలో మార్పులు చేస్తుంటారు. నా ఇల్లు.. నియవ్వ తగ్గేదే లే అంటూ ఓ సినిమాలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ వాడేస్తుంటారు. అయితే, హోమ్ లోన్ విషయంలో చేయకూడని ఆరు తప్పులను ప్రముఖ ఆర్థిక నిపుణులు వంగ రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ఇంటి కోసం అల్లు అర్జున్ లాగా నియవ్వ తగ్గేదే లే అంటే కుదరదు బాస్.. మీరు అల్లు అర్జున్ కాదు అంటూ చురకలు అంటించారు. సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో పలు రీల్స్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.