తెల్లాపూర్ అయ్యప్ప మహా పడి పూజకు ఎం పి రఘనందన్ రావు గారికి ఆహ్వానం
తెల్లాపూర్ అయ్యప్ప మహా పడి పూజకు ఎంపీ రఘనందన్ రావు గారికి ఆహ్వానం
పూజా కార్యక్రమ కరపత్రం అందజేసి ఆహ్వానించిన మంగలి శ్రీనివాస్, కొల్లూర్ సుధాకర్ రెడ్డి గురు స్వాములు
సంగారెడ్డి: డిసెంబర్ 1వ తేదీన తెల్లాపూర్ గ్రామంలో నిర్వహించనున్న అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమానికి సంగారెడ్డి పార్లమెంట్ సభ్యులు రఘనందన్ రావు గారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంగలి శ్రీనివాస్ గురు స్వామి, కొల్లూర్ సుధాకర్ రెడ్డి గురు స్వాములు కలిసి ఎంపీ రఘనందన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మహా పడి పూజ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆయనకు అందజేసి, డిసెంబర్ 1వ తేదీన తెల్లాపూర్ గ్రామంలో నిర్వహించనున్న అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.