తెల్లాపూర్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎం పి రఘునందన్ రావు

RVIRVI
23 Nov, 26
 0  3
తెల్లాపూర్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎం పి రఘునందన్ రావు
తెల్లాపూర్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎం పి రఘునందన్ రావు

తెల్లాపూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు


తెల్లాపూర్: తెల్లాపూర్‌లోని ఇంద్రనగర్ కాలనీ బస్తీ దవాఖానలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు.


అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వైద్య సిబ్బందితో మాట్లాడి, విధి నిర్వహణలో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.


ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, దేశాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.


ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగ నిర్మల, డాక్టర్ కల్పనా, బీజేపీ తెల్లాపూర్ అధ్యక్షులు రాంబాబు గౌడ్, మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, మల్లేపల్లి రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, కోటే రవి, సురేష్, మంగలి శ్రీనివాస్, వెంకట రావు, నర్సింహ రెడ్డి, నవారి మాణిక్ రెడ్డి, కొల్లూర్ సుధాకర్ రెడ్డి, నరేష్, విష్ణు, లక్ష్మారెడ్డి, జోగు రవి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.